అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రయోగాత్మక పాత్రను పోషించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘పుష్ప’లో ఎర్రచందనం స్మగ్లర్‌గా కెరీర్లోనే పూర్తిస్థాయి మాస్ పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే విడుదలైన ఇంట్రడక్షన్ మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. మునుపెన్నడూ చూడని రఫ్ లుక్‌లో అల్లు అర్జున్ కనిపించారు. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఈ సినిమా అనంతరం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అల్లు అర్జున్ ‘ఐకాన్’ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసింది. ‘కనబడుటలేదు’ అన్నది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు దర్శకుడు శ్రీరామ్ వేణు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో అల్లు అర్జున్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నారని తెలిసింది. టైటిల్ ఉపశీర్షిక ఆయన పాత్ర చిత్రణను ప్రతిబింబించేలా నిర్ణయించారని అంటున్నారు. అంధుడి పాత్రలో అల్లు అర్జున్ ప్రయోగం చేయబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇందులో నిజానిజాలేమిటో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందేనని అంటున్నారు. అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.