Kriti Sanon | కృతిసనన్ రక్షాబంధన్ యాడ్‌పై వివాదం.. ప్రకటనను వెనక్కి తీసుకున్న జ్యువెలరీ బ్రాండ్!
GIVA | ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గీవా' (GIVA) ఇటీవల విడుదల చేసిన రక్షాబంధన్ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
GIVA | ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘గీవా’ (GIVA) ఇటీవల విడుదల చేసిన రక్షాబంధన్ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రలో నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, పలువురు నెటిజన్లు మరియు కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ సంప్రదాయాలను, పవిత్రమైన రక్షాబంధన్ పండుగను తప్పుగా చిత్రీకరించేలా ఈ ప్రకటన ఉందంటూ వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పండుగ పవిత్రతకు భంగం కలిగించేలా యాడ్ కంటెంట్ ఉందంటూ బ్రాండ్‌పై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వ్యతిరేకత పెరగడంతో అప్రమత్తమైన ‘గీవా’ యాజమాన్యం తక్షణమే స్పందించింది. వివాదాస్పదమైన ఆ ప్రకటనను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, మీడియా మాధ్యమాల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ వివాదంపై వివరణ ఇస్తూ జీవా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మరియు పండుగలపై మాకు అత్యంత గౌరవం ఉంది. ఎప్పుడూ కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవడాన్ని నమ్మే మా బ్రాండ్, ఈసారి ఆ ఆనందాన్ని పెంపుడు జంతువులకు కూడా విస్తరించాలనే మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్‌ను రూపొందించాము. అయితే, మా తాజా ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను అనుకోకుండా గాయపరిచినట్లయితే, అది మా ఉద్దేశం కానే కాదు. అందరి మనోభావాలను, నమ్మకాలను గౌరవిస్తూ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నాము అని సంస్థ స్పష్టం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

