బీహార్లో విద్యార్థుల ఉద్యమం ఉధృతమవుతున్నది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది విద్యార్థులు రాజధాని పాట్నాలో ఆందోళనకు దిగారు. అయితే బీహార్లో నిరసనల్లో ప్రధానమంత్రి పదవికి మోదీ రాజీనామా చేయాలని పోస్టర్ పట్టుకున్నందుకు ఆరేళ్ల బాలుడిని పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మంగళవారం పరీక్షల్లో అక్రమాలు, నిరుద్యోగంపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు.
ఈ క్రమలో ఒకటో తరగతి విద్యార్థి ఆదిత్య కుమార్ తన తల్లితో కలిసి ఆందోళన పోస్టర్ను పట్టుకుని మీడియా దృష్టినిఆకర్షించాడు. విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని, ప్రభుత్వ వైఫల్యాలను తప్పుబడుతూ బీహార్ సీఎం, పీఎం మోదీ రాజీనామా చేయాలని ఆ చిన్నారి డిమాండ్ చేశాడు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే బాలుడిని అక్కడ నుంచి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కాగా, బీహార్లో మరోసారి విద్యార్థులపై లాఠీ విరిగింది. బీపీఎస్సీ 70వ పరీక్షలో అక్రమాలు జరిగాయని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వేలాదిమంది విద్యార్థులు రాజధాని పట్నాలో జరిపిన ఆందోళన వారి ఆవేదనను ప్రతిబింబించింది. సీఎం సామ్రాట్ చౌదరి నివాసానికి ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిపై లాఠీచార్జీ చేయడమే కాక, జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనల్లో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
వందలాది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ ) ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన పరీక్షలో పలు అక్రమాలు చోటుచేసుకున్నందున దానిని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వచ్చే నెలలో నిర్వహించే టీచర్ రిక్రూట్మెంట్ను ఒకే విడతలో నిర్వహించాలని కోరుతూ మంగళవారం ‘ముఖ్యమంత్రి నివాస ముట్టడి’కి పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ తదితర వామపక్ష సంఘాలతో కలిసి విద్యార్థులు గాంధీ మైదానం నుంచి ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నివాసం వైపు దూసుకొస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ప్రదర్శన ప్రారంభంలోని జేపీ గోలంబర్ వద్ద ఆందోళనకారులపై పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు.
బీహార్లో నిరసనల్లో ప్రధానమంత్రి పదవికి మోడీ రాజీనామా చేయాలని పోస్టర్ పట్టుకున్నందుకు ఆరేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బీహార్లో 70వ బీపీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ పరీక్షలను రద్దు చేయాలని నిరసనలు చేస్తున్న విద్యార్థులు pic.twitter.com/a53glSu1at
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
అవసరమైతే బుల్లెట్ గాయాలకు కూడా సిద్ధమే
బీహార్ పేపర్ లీకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో చిన్నారి మాటలు
లాఠీ చార్జీలకు, జైళ్లకు, బుల్లెట్లకు భయపడి వెనక్కి తగ్గేది లేదు
ఇప్పుడు పేపర్ లీకులు అవుతున్నాయి, నేను పెద్దయ్యాక కూడా ఇలాంటివి జరగకూడదని నేను కూడా నిరసనకు దిగాను https://t.co/uWLVlvpqcA pic.twitter.com/QTwATW7kB0
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026