The Vvaan | మైథలాజికల్ మూవీలో తమన్నా.. ఆసక్తికరంగా ‘ది వీవాన్’ టీజర్!
The Vvaan | బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ "ది వీవాన్" (The Vvaan).
The Vvaan | బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra) స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ “ది వీవాన్” (The Vvaan). దీపక్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అరుణాభ్ కుమార్ కథను అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు బాలాజీ మోషన్ పిక్చర్స్ (Balaji Motion Pictures) ది వైరల్ ఫీవర్ (TVF) సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ టీజర్ చూస్తుంటే.. సూర్యాస్తమయం తర్వాత ఎక్కడికి వెళ్లడం నిషిద్ధమో.. కథ అక్కడి నుంచే మొదలవుతుంది” అనే కాన్ప్సెప్ట్తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఎవరైతే రాత్రి సమయంలో ఆ అడవిలోకి వెళ్తారో వారు తిరిగి రారనే ఒక దట్టమైన చీకటి శక్తి, రహస్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పటివరకు చూడని సరికొత్త యాక్షన్ అవతార్‌లో కనిపించగా, ఆయనకు ఆ అడవికి మధ్య ఏదో గూఢమైన సంబంధం ఉందని తమన్నా పాత్ర చెబుతుంది. టీజర్ చివర్లో వచ్చే విజువల్స్ దైవిక శక్తులు మరియు పురాణాల (Mythology) నేపథ్యాన్ని గుర్తుచేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో సిద్ధార్థ్, తమన్నాలతో పాటు సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ మరియు అనూప్ సోని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

