Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అల్లు అర్జున్ తన ఖాళీ సమయాల్లో సోషల్ మీడియాలో ఎక్కువ గడుపుతాడు. తన సినిమా అప్డేట్స్తోపాటు పలు ఆసక్తికర విశేషాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా తనకు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిప్ట్ వచ్చిందని ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ గిప్ట్ ఏంటి అంటే.!
”గుర్తు తెలియని ఒక వ్యక్తి నాకు బర్న్డ్ బినీత్ ది ఫైర్ ఆఫ్ డిసైర్ (Burned Beneath the Fire of Desire) అనే పుస్తకాన్ని పంపించినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని పంపించిన వ్యక్తి నిజాయితీ, నాపై చూపించిన చొరవతో నా మసను నిండింది. ఒక బుక్ లవర్‌గా నాకు ఇది ఆనందాన్ని కలిగించింది. దీనిని రచించిన సీకే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్’’ అని అల్లు అర్జున్ ఇన్‌స్టాలో రాసుకోచ్చారు.
Allu Arjun