Allu Arjun | నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్
Allu Arjun submits bail bond Documents | సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బన్నీ బెయిల్ పత్రాలు సమర్పించారు.
Allu Arjun submits bail bond Documents | సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు నాంపల్లి కోర్టుకు హాజరైన బన్నీ బెయిల్ పత్రాలు సమర్పించారు. న్యాయమూర్తి ముందు హాజరైన బన్నీ రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులకు సంబంధించిన పత్రాలను సమర్పించారు. మరోవైపు రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం అల్లు అర్జున్‌ని ఆదేశించింది.
పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ ఆయనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ కోసం అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై శుక్రవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కి రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేసింది.
Also Read..
- KTR | మేడిగడ్డకు కాదు.. రేవంత్‌రెడ్డి బుర్రకి పర్రె పడ్డది..! బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శలు
- TTD Chairman | మహాకుంభ మేళలో శ్రీవారి నమూనా ఆలయం : టీటీడీ చైర్మన్
- Kiara Advani | ఆసుపత్రిలో చేరిన కియారా అద్వానీ.?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

