Allu Arjun | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనతను సాధించిన విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ (madame tussauds) మ్యూజియం- దుబాయ్‌లో ఆయన మైనపు విగ్రహం (allu arjun wax statue) కొలువుదీరింది. ఈ విగ్రహాన్ని స్వయంగా అల్లు అర్జున్ ఆవిష్కరించడం విశేషం. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్‌తో పాటు అతడి ఫ్యామిలీ దుబాయ్‌లో సందడి చేసింది. అయితే ఈ విగ్రహంకు సంబంధించిన బీటిఏస్ వీడియోను తాజాగా అల్లుఅర్జున్ యూట్యూబ్ వేదికగా విడుదల చేశాడు. ఇక ఈ వీడియోలో తన మైనపు విగ్రహం సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు. ఇక ఈ వీడియో మీరు చూసేయండి.
‘పుష్ప’తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఆ సినిమాతోనే ఉత్తమనటుడిగా జాతీయ అవార్డును అందుకొని, తెలుగులో ఆ క్రెడిట్ సాధించిన తొలి హీరోగా నిలిచారు. ఆరుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అభిమానులకు ఆయన ఐకాన్ స్టార్.