స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ తన క్రేజ్‌ని రోజురోజుకి పెంచుకుంటూ పోతున్నాడు.బన్నీకి తెలుగు రాష్ట్రాలలోనే కాదు పక్క రాష్ట్రాలతో పాటు పలు దేశాలలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ నటిస్తున్నపుష్ప చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అల్లు అర్జున్ మేకోవర్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచింది. నోటిలో కత్తి పెట్టుకొని ఐకాన్ స్టార్ చేసిన డాన్స్ లకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఐదు భాషల్లో 5గురు లీడింగ్ సింగర్స్ ఈ పాట పాడారు. 80 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట 1.65 మిలియన్ లైకులు కూడా సాధించింది. క్రిస్మస్ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.
పుష్ప షూటింగ్ చివరి దశలో ఉండగా, చిత్రీకరణకు స్మాల్ బ్రేక్ ఇచ్చిన బన్నీ ఇటీవల యూఏఈ వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ అల్లు అర్జున్‌ని కలుసుకొని ఆయనకు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బహుమానంగా ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.