Kranthi Kiran | అధికారంలో కొనసాగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదు : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
Kranthi Kiran | ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
టేక్మాల్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత ( No Moral Right ) లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్( Former MLA Kranthi Kiran ) అన్నారు. ఆ పార్టీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం విధ్వంసంపై టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అధ్యక్షతన గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే టేక్మాల్ చౌరస్తాలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు.

రైతుల గోడును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక, క్వింటాళ్ల కొద్దీ తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై సచివాలయ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, రైతుల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన బాండ్ పేపర్ల హామీల ఆధారంగా రూపొందించిన బాకీ కార్డులను ప్రతి గ్రామంలోని ఇంటింటికీ పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, విజయ్, పీఏసీఎస్ ఛైర్మన్ యశ్వంత్ రెడ్డి, నాయకులు సిద్దయ్య, సలీం, భాస్కర్, బసంతరావు, రవి, గోవిందచారి, మాజీ ఎంపీపీ చింత స్వప్న, మాజీ ఎంపీటీసీ మోహన్, మాజీ సర్పంచులు భక్తుల వరలక్ష్మి, నాయికోటి సుప్రజ, సంగయ్య, శ్రీనివాస్, రాజు, మల్లేశం, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

