Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జీక్యూ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఈ ఏడాదికి గాను ఆయన్ని వరించింది. హైదరాబాద్ ఫలుక్నామా ప్యాలెస్‌లో జరిగిన వేడుకలో బన్ని ఈ వార్డును అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ద్వారా బన్ని షేర్ చేశారు. లీడింగ్ మ్యాన్ ఆఫ్ 2022 అవార్డుతో తనను సత్కరించినందుకు జీక్యూ ఇండియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా లక్ష్యాల జాబితాలోని ఒకదాన్ని ఇలా నెరవేర్చుకున్నా అంటూ బన్ని సంతోషం వ్యక్తం చేశారు.
కాగా, ఫ్యాషన్, కల్చర్, పాలిటిక్స్ వంటి విభాగాల్లో అత్యధిక ప్రతిభ కనబర్చిన వాళ్లకు ఈ అవార్డ్స్ అందజేస్తుంటారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి వ్యక్తి అల్లు అర్జున్ కావడం విశేషం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రంలో బన్నికి జోడీగా రష్మిక నటిస్తోంది.