Pushpa The Rule | టాలీవుడ్, పాన్ ఇండియా మూవీ లవర్స్‌తోపాటు గ్లోబల్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప.. ది రూల్ (Pushpa The Rule). పుష్ప ది రైజ్‌కు కొనసాగింపుగా అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌కు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహిస్తున్నాడు. పుష్ప ది రూల్ సినిమా నుంచి బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది.. రూలింగ్ ఫ్రమ్ బాక్సాఫీస్.. అని మైత్రీ మూవీ మేకర్స్ టీం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం మేకర్స్ పెట్టిన సస్పెన్స్‌కు తెరదించారు. పుష్ప ది రూల్ నుంచి రాబోతున్న ఆ ప్రకటన మరేంటో కాదు. పుష్ప ది రూల్ విడుదల తేదీ ఎప్పుడనేది తెలియజేశారు మేకర్స్. పుష్ప ది రూల్ 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పుష్ప రాజ్ మళ్లీ వస్తున్నాడు.. అంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఫహద్ ఫాసిల్ జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సీక్వెల్ కోసం సుకుమార్-అల్లు అర్జున్ టీం ఇరగదీసే కొత్త హుక్ స్టెప్స్ రెడీ చేసిందట. పార్ట్ 1కు అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ నుంచి మరో చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఉండబోతుందని ఇప్పటికే తెలియజేశారు సుకుమార్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఫస్ట్ పార్టును మించిన బడ్జెట్‌తో సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది. ఫస్ట్ పార్టులో శ్రీవల్లిగా నటించిన కన్నడ సోయగం రష్మిక మందన్నా రెండో పార్టులో కూడా సందడి చేయబోతుంది.
పుష్ప ది రూల్ రిలీజ్ అప్డేట్ లుక్ ..
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023