షర్ట్ నలగకుండా 500 కోట్లు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతున్నది. కేవలం వారంరోజుల్లోనే ఈ సినిమా 500కోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. తాజాగా ఈ సినిమాపై అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. రజనీకాంత్ స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో, ఆయన ైస్టెల్, స్వాగ్‌కు అభిమానులు ఎంతలా ఫిదా అయ్యారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని కొనియాడారు.
- ‘జైలర్-2’పై బన్నీ ప్రశంసలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతున్నది. కేవలం వారంరోజుల్లోనే ఈ సినిమా 500కోట్ల వసూళ్ల మైలురాయిని దాటింది. తాజాగా ఈ సినిమాపై అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. రజనీకాంత్ స్టార్డమ్ ఏ స్థాయిలో ఉందో, ఆయన ైస్టెల్, స్వాగ్‌కు అభిమానులు ఎంతలా ఫిదా అయ్యారో ఈ సినిమా చూస్తే అర్థమవుతుందని కొనియాడారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దాడని, ఈ ఏడాది గొప్ప కమర్షియల్ ఎంటర్టైనర్ ఇదని అన్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం సినిమాలో హైలైట్‌గా నిలిచిందని ప్రశంసించారు. చొక్కా నలగకుండా 500కోట్లు కొట్టడం ఒక్క రజనీకాంత్‌కే సాధ్యం అని బన్నీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఏడాది సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘ధురంధర్-2’ 1813 కోట్ల వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత ‘జైలర్-2’ 576కోట్ల వసూళ్లతో రెండో స్థానంలో ఉంది. అయితే ఈ ఏడాది పూర్తవడానికి మరో రెండు నెలలకుపైగా సమయం ఉండటంతో అప్పుడే బాక్సాఫీస్ తుది ఫలితాలపై స్పష్టత ఇవ్వలేమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

