ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకుడు. అనిల్ మోదుగ నిర్మాత. ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం పాపులర్ హీరో అల్లు అర్జున్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సర్వైవల్ థ్రిల్లర్‌గా.. పూర్తి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. మోనోఫోబియా అనే మానసిక రుగ్మత వున్న హీరో అనుకోని పరిస్థితుల్లో వంటగది గ్యారేజ్‌లో చిక్కుకుపోతాడు. ఈ ఫోబియా వున్న వారికి ఒంటరిగా గడపటం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. ఆ గ్యారేజ్ నుండి హీరో ఎలా బటపడ్డాడు అనేది ఎంతో ఆసక్తికరంగా వుంటుంది’ అన్నారు.