Allu Arjun | ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన పుష్ప 2 ఓపెనింగ్స్ నుంచే రికార్డుల వర్షం కురిపించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మొదటి రోజే రూ.290 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పుష్ప 2 మొత్తం వసూళ్లు రూ.1800 కోట్లు దాటి, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక అత్యంత పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ ఘన విజయంతో అల్లు అర్జున్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. “పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్!” అన్న డైలాగ్ నిజంగా అల్లు అర్జున్ కెరీర్‌కు కూడా సరిపోతుంది..
ఇప్పుడిప్పుడే గ్లోబల్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్న ఐకాన్ స్టార్‌కి మేకర్స్ నుంచి భారీ డిమాండ్ ఉంది. ఆయనతో సినిమాలు చేసేందుకు పోటీపడుతున్నారు. అయితే ఇప్పటికే పుష్ప 2 విజయంతో టాప్ లెవల్‌కి ఎక్కిన బన్నీ, తాజాగా రికార్డ్ రెమ్యునరేషన్‌తో వార్తల్లోకి ఎంటర్ అయ్యాడు. బాలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, అల్లు అర్జున్ తమిళ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి అక్షరాలా రూ.175 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నాడు. ఇది ఇప్పటివరకు ఇండియన్ హీరోకి లభించిన అత్యధిక పారితోషికం. ఈ రికార్డ్ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపైన ఉండగా, ఆయనకు కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు రెమ్యునరేషన్‌గా ఇచ్చారు. ఇప్పుడు ఆ మార్క్‌ను బ్రేక్ చేసి, అల్లు అర్జున్ టాప్ స్పాట్‌ను ఆక్రమించాడు.
ఈ వార్త తెలిసిన బన్నీ అభిమానులు ఉత్సాహంలో మునిగి తేలుతున్నారు. “ఇది కేవలం ఆరంభం మాత్రమే, రాబోయే సినిమాతో బన్నీ హాలీవుడ్ రేంజ్‌కి వెళ్తాడు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక సౌత్ హీరో, తానెంత టాలెంటెడ్ అనే విషయాన్ని పుష్ప 2తో దేశవ్యాప్తంగా నిరూపించుకున్నాడు. ఇప్పుడు దేశంలోని అత్యధిక రెమ్యునరేషన్ పొందే హీరోగా నిలిచిన బన్నీ పేరు ఇండియన్ సినిమా పటములో పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కబడిందనే చెప్పాలి. “తగ్గేదేలే” అన్నది ఇప్పుడిక మాట కాదు.. మార్కెట్ స్టేట్మెంట్ అని నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు.