Allu Arjun Chiranjeevi | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టైన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) చంచల్‌గూడ జైలు నుంచి శనివారం విడుదలయిన విషయం తెలిసిందే. అతడు విడుదలయ్యాక నేరుగా తన నివాసానికి వెళ్లగా.. అతడిని పరమర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులు అతడి ఇంటికి వచ్చారు. అయితే బన్నీ అరెస్ట్ అయిన అనంతరం చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. షూటింగ్ మధ్యలోనే ఆపి బన్నీ ఇంటికి వచ్చాడు చిరు.
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో తాజాగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లాడు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసానికి బన్నీనే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే చాలా రోజుల తర్వాత అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ కలుస్తుండటం ఆసక్తిగా మారింది.
BREAKING: Allu Arjun family arrives at Chiranjeevi residence🏡🏠 pic.twitter.com/GC8FLgBe9H
— Manobala Vijayabalan (@ManobalaV) December 15, 2024