పాన్ ఇండియా సంస్కృతికి తెలుగు సినిమా నాంది పలకడంతో భారతీయ సినిమా ఎల్లలు చెరిగిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్లో నటించడం గొప్ప. కానీ ఇప్పుడు బాలీవుడ్‌కు చెందిన నటీనటులు సైతం దక్షిణాది సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ‘భరత్ అనే నేను’లో కైరా అద్వానీ, ‘ఆర్ఆర్ఆర్’లో అలియాభట్, ‘దేవర’లో జాన్వీకపూర్ ఇలా చెప్పుకుంటూపోతే తెలుగులో నటించి, నటిస్తున్న బాలీవుడ్ నాయికల లిస్ట్ పెద్దదే. దీపిక పదుకోన్ కూడా ప్రస్తుతం ‘కల్కీ 2898’లో నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఓ వైపు ఈ సినిమా చేస్తూనే మరోవైపు ఇంకో తెలుగు సినిమాలో నటించేందుకు దీపిక పచ్చజెండా ఊపేసిందని విశ్వసనీయ సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని సంస్థలు నిర్మించనున్న చిత్రంలో కథానాయికగా దీపిక పదుకోన్ ఎంపికైనట్టు తెలుస్తున్నది. బన్నీకి జోడీగా దీపిక పదుకోన్ అనేది నిజంగా ఊహించని కాంబినేషన్. బన్నీ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఈ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు తెలియాల్సివుంది.