అల్లు అర్జున్ ‘పుష్ప-2’ తర్వాత త్రివిక్రమ్ సినిమా చేస్తారా? లేక వేణుశ్రీరామ్ సినిమా చేస్తారా? ఈ విషయంపై బయట బాగానే చర్చలు నడుస్తున్నాయి. అయితే.. పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు.. వీరిద్దరికీ కాకుండా బన్నీ డేట్స్‌ని తమిళ దర్శకుడు అట్లీ ఎగరేసుకుపోయినట్టు ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తున్నది. అట్లీ దగ్గర కథ రెడీగా ఉండటంతో బన్నీ బల్క్ డేట్స్ ఇచ్చేసినట్టు తెలుస్తున్నది.
‘పుష్ప-2’ పూర్తికాగానే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గీతా ఆర్ట్స్‌తో కలిసి ఓ ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నట్టు వినికిడి. ‘జవాన్’ని మరిపించే స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా అట్లీ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడట. వాస్తవ సంఘటనల ప్రేరణతో ఓ జీవితాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాడట అట్లీ. దేశం గర్వించే స్థాయిలో సినిమా ఉండబోతున్నట్టు సమాచారం.