Allu Arjun – Atlee | ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు బన్నీ సినిమాలకు మామలు డిమాండ్ లేదు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలలో అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఆగష్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా అనంతరం బన్నీ అట్లీ కాంబోలో మూవీ రానున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గతేడాది ‘జవాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు తమిళ దర్శకుడు అట్లీ. ఇక ఈ సినిమా అనంతరం అల్లుఅర్జున్‌తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అట్లీ తన అసిస్టెంట్ దర్శకులతో స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేస్తున్నట్లు వీడియో ఉంది. ఇక ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అల్లు అర్జున్ పుట్టినరోజు(ఏప్రిల్ 08) నాడు ప్రకటించనున్నట్లు టాక్.
#AAA – Allu Arjun – Atlee – Anirudh pic.twitter.com/SHAWSs5Z6n
— Aakashavaani (@TheAakashavaani) March 13, 2024
సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు టాక్. కాగా ఈ సినిమా కోసం బన్నీ ఏకంగా రూ.120 కోట్లు డిమాండ్ చేశాడని తెలుస్తుంది. ప్రస్తుతం బన్నీకున్న క్రేజ్ దృష్ట్యా మేకర్స్ సైతం అంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయిపోయారట. పుష్ప సీక్వెల్ రిలీజవ్వగానే.. ఈ సినిమా పట్టాలెక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఇక ఈ సినిమా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.