Allu Arjun Arrest – Megastar Chiranjeevi | ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 విడుదల రోజున జరిగిన ఘటనకు సంబంధించి కథానాయకుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) బెనిఫిట్ షో నేపథ్యంలో అల్లు అర్జున్ రాక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ మృతి చెందగా. ఆమె కుమారుడు శ్రీతేజ్ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అల్లు అర్జున్‌పై ఇప్పటికే నమోదు చేయగా.. తాజాగా ఈ కేసులో చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు అల్లు అర్జున్ను చిక్కడపల్లి పీఎస్‌కు తీసుకెళ్లారు. అయితే అల్లు అర్జున్ కోసం ఇప్పటికే తన తండ్రి అల్లు అరవింద్‌తో పాటు తమ్ముడు అల్లు శిరీష్ కూడా పీఎస్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం తెలిసిన మెగాస్టార్ చిరంజీవి కూడా అల్లు అర్జున్ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో ఉన్న చిరు ఈ విషయం తెలియగానే షూటింగ్ మధ్యలో ఆపి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు బయలుదేరినట్లు సమాచారం.