‘పుష్పా’ ఫ్రాంచైజీ తర్వాత అల్లు అర్జున్ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు చేరుకుంది. దాంతో ఆయన తాజా సినిమాకోసం అభిమానులేకాక, సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఐకాన్‌స్టార్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ని తెలియజేస్తూ.. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్‌పై చిత్రీకరించిన ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
పానిండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘A22 x A6’గా పిలవబడుతున్న ఈ చిత్రం భారతీయ విలువలతో కూడిన కథనంతో ఓ భారీ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షించేలా యాక్షన్, భావోద్వేగాలు ఉంటాయని, అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో సినిమా రూపొందనున్నదని మేకర్స్ వెల్లడించారు. ఈ ఏడాది చివర్లో చిత్రీకరణ మొదలుకానున్న ఈ పానిండియా సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.