Allu Arha | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయ అల్లు అర్హకి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుంటాయి. ఫన్నీ బెస్ట్ మూమెంట్స్ అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి. తన తండ్రితో సరదాగా గడిపిన క్షణాలు, క్యూట్ డైలాగ్స్ బన్నీలేదా స్నేహా రెడ్డిలు తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో అవి నెటిజన్స్‌తో పాటు బన్నీ అభిమానులని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. రీసెంట్గా మంచు లక్ష్మితో అల్లు అర్హ ఫన్నీ మూమెంట్ తెగ వైరల్ అయింది. అందులో మంచు లక్ష్మి ‘నువ్వు నన్ను ఏదో అడగాలనుకున్నావట కదా ఏంటి?’ అని అడగ్గా… మీరు తెలుగువారేనా? అంటూ క్యూట్‌గా ప్రశ్నించింది అర్హ.
చిన్నారి ప్రశ్నకి లక్ష్మీ షాక్ అవుతూ… ‘నేను తెలుగే పాప. నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది.’ అంటూ పడి పడి నవ్వేసింది… ‘మీ యాక్సెంట్ అలా ఉంది’ అంటూ అర్హ చెప్పడంతో మంచు లక్ష్మితో పాటు అల్లు అర్జున్, స్నేహ కూడా తెగ నవ్వేసుకున్నారు. ఈ వీడియో క్షణాలలోనే వైరల్ అయింది. నెటిజన్స్‌ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అర్హ తన తండ్రితో కలిసి పలు వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక శాకుంతలం సినిమాలో బాలనటిగా కూడా నటించి అలరించింది.బన్నీ భార్య స్నేహా రెడ్డి తన ఇద్దరు పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహపరుస్తుంది.
పండగలు, ఫంక్షన్స్ ఫోటోలు మాత్రం మిస్ కాకుండా షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా స్నేహ అల్లువారి ఇంట జరిగిన రాఖీ వేడుకలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అన్న అయాన్ కు అర్హ రాఖీ కట్టడం, ఆ తర్వాత అల్లు వారసులకు రాఖీలు కట్టిన అర్హ వారి ఆశీర్వాదాలు తీసుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ క్యూట్ వీడియో ఫ్యాన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే కేవలం పిల్లలు రాఖీ సెలబ్రేషన్స్ మాత్రమే స్నేహా రెడ్డి చూపించింది. మరి బన్నీ ఎవరి చేత రాఖీ కట్టించుకున్నాడు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచింది స్నేహా రెడ్డి.