Gajini Sequel on Cards | పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ‘గజిని’ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో సూర్యకు తెలుగులో తిరుగులేని పాపులారిటీ వచ్చింది. ఇక ఇదే సినిమాను ఏ.ఆర్ మురుగుదాస్ హిందీలో అమీర్‌ఖాన్‌తో రీమేక్ చేశాడు. అక్కడ కూడా ఈ సినిమాకు ఎక్కడలేని రెస్పాన్స్ వచ్చింది. హిందీలో ఈ సినిమా రిలీజ్ చేసిన అల్లు అరవింద్‌కు కాసుల వర్షం కురిసింది. ఒక్క దెబ్బతో ఏ.ఆర్ మురుగదాస్ అటు సౌత్ ఇటు నార్త్‌లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఈ సినిమాకు సీక్వెల్ కొనసాగించాలని డిమాండ్ ఏర్పడింది.
అయితే కథ కుదరక పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. దానికి తోడు గతకొంత కాలంగా మురుగుదాస్ సినిమాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తొమ్మిదేళ్ళ క్రితం వచ్చిన కత్తి తర్వాత ఇప్పటివరకు మురుగుదాస్‌కు హిట్టే లేదు. మధ్యలో సర్కార్, దర్బార్ బాగానే ఆడినా కమర్షియల్ ఫేయిల్యూర్‌గా మిగిలాయి. ఇక చాలా రోజులగా వీరిద్దరూ గజిని సీక్వెల్ కోసం చర్చలు జరుపుతున్నారట. అంతేకాకుండా అల్లు అరవింద్ కూడా గత ఐదారు నెలల్లో చాలా సార్లు అమీర్‌ఖాన్‌తో చర్చలు జరిపాడట. దాదాపు ఈ ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయినట్లే తెలుస్తుంది. ఈ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్న అమీర్ ఖాన్ కూడా కాస్త ఆలోచించి రీమేక్‌లు గట్రా వాటి జోలికి పోకుండా గజిని సీక్వెల్‌ను తీయాలని భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.