Allari Naresh | ఎవడి కోసం తగ్గాలంటున్న అల్లరి నరేష్.. అసలు సంంగతేంటి?
అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగదేవి దర్శకుడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయిక.
Allari Naresh | అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చలమల్లి’. సుబ్బు మంగదేవి దర్శకుడు. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయిక. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం అల్లరి నరేష్ జన్మదినం సందర్భంగా ఫస్ట్‌గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో ఆయన పూర్తి మాస్ అవతారంలో కనిపించారు.
యాక్షన్, ఎమోషనల్ కంటెంట్‌తో గ్లింప్స్ ఆకట్టుకుంది. ‘ఏయ్..ఎవడి కోసం తగ్గాలి. ఎందుకు తగ్గాలి..’ అంటూ అల్లరి నరేష్ చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. అల్లరి నరేష్ ఇంతవరకు ఈ తరహా మాస్ క్యారెక్టర్ చేయలేదని, ఆయన కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్ ఎమ్ నాథన్, సంగీతం: విశాల్‌చంద్రశేఖర్, కథ, మాటలు, దర్శకత్వం: సుబ్బు మంగదేవి.
సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రం
అల్లరి నరేష్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ కొత్త చిత్రాన్ని ప్రకటించింది. మోహర్తేజ్ దర్శకత్వం వహిస్తారు. ఆదివారం కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘మీరు అతని కంటి నుంచి తప్పించుకోలేరు’ అనే క్యాప్షన్‌తో పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. విభిన్నమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, అల్లరి నరేష్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
DEO Ramesh | సమాజంలో ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది : డీఈవో రమేశ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

