Itlu Maredumilli Niyojakavargam Pre-Teaser | చాలా కాలం తర్వాత ‘నాంది’తో సూపర్ హిట్ విజయాన్ని సాధించాడు అల్లరినరేష్. గత కొన్నేళ్ళ నుండి కామెడీ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్న నరేష్ నాందితో పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించి తన నటన కేపబులిటీస్‌ను మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’ ఒకటి. ఏ.ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన టీజర్లో షూటింగ్‌కు సంబంధించిన లోకేషన్లను చూపుతూ 55రోజుల షూటింగ్లో ప్రతి లోకేషన్‌కు చేరుకోవడానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టేదని టీజర్లో చూపించారు. వంజంగీ హిల్స్‌కు ఉదయం 3 గంటల నుండి 6 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా 22 అన్ఎక్స్ప్లోరుడ్ లోకేషన్లలో 250మంది యూనిట్ సభ్యులతో షూటింగ్ జరిపినట్లు ప్రీ టీజర్లో చూపించారు. మొత్తంగా టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మేకర్స్ పెట్టిన ఎఫర్ట్స్ కళ్ళకట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రీ టీజర్‌తో చిత్రబృందం సినిమాపై అంచనాలను పెంచింది.
ఈ చిత్రంలో అల్లరినరేష్ ఎలక్షన్ అధికారిగా కనిపించనున్నాడు. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఫేం ఆనంది ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ రెడ్డి ఛాయగ్రహకుడిగా పనిచేస్తున్నాడు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్నాడు. జీ స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.