Allari Naresh 60th Movie First Look Poster | చాలా కాలం తర్వాత ‘నాంది’ చిత్రంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు అల్లరి నరేష్. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే అల్లరి నరేష్..నాందీతో పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో నటించి విమర్శకులు నుండి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలో నరేష్ తన విలక్షమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్‌గా కూడా మంచి విజయం సాధించి అల్లరి నరేష్ మార్కెట్‌ను పెంచింది. విజయ్ కనకమేడల దర్శకత్వ ప్రతిభకు గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఈ కాంబోలో రెండవ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలోనే అధికారకంగా ప్రకటన వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లేటెస్ట్గా విడదులైన పోస్టర్లో అల్లరి నరేష్ వీపు భాగంలో కత్తి గుచ్చుకుని ఒంటి నిండా రక్తంగా ఉగ్ర రూపంలో కనిపిస్తున్నాడు. కేవలం పోస్టర్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేశారు. ఈ చిత్రానికి ఉగ్రం అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. త్వరలోనే మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.
“Ugram”… #NareshVijay2 @vijaykkrishna @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala #Naresh60 pic.twitter.com/Z73YZo4pp1
— Allari Naresh (@allarinaresh) August 22, 2022