అఖిల్ అక్కినేని ప్రస్తుతం చేస్తున్న సినిమా ‘లెనిన్’. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలనే కసితో ఆయన ఈ సినిమా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓ విభిన్నమైన కథను ఎంచుకున్నారాయన. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇదిలావుంటే.. ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తున్నది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారట. ఇటీవలే విడుదలైన టీజర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది.
ఇప్పుడు నాగ్ కూడా ఇందులో భాగం కానున్నారన్న వార్త రావడంతో సినిమాపై బజ్ రెట్టింపయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన ‘మనం’ సినిమాతో తొలిసారి తెరపై కనిపించారు అఖిల్. ైక్లెమాక్స్లో వచ్చే ఆ సీన్లో నాగార్జున కూడా ఉంటారు. మళ్లీ ఇన్నాళ్లకు తండ్రితో కలిసి ‘లెనిన్’లో అఖిల్ నటిస్తుండటం అక్కినేని అభిమానులకు నిజంగా శుభవార్తే. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.