దిగ్గజ నటుడు మోహన్‌లాల్ కథానాయకుడిగా పృధ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘లూసిఫర్’ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ‘ఎల్2 ఎంపురాన్’ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఖురేషి అబ్రహం అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మళ్లీ తెరపై మోహన్‌లాల్ నటవిశ్వరూపం చూపించనున్నారని, తొలి భాగాన్ని మించేలా ఈ మలిభాగం రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు. సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్డమ్, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగిందని, సాంకేతికంగా ఓ అద్భుతాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, జెరోమ్ ప్లిస్, అభిమన్యుసింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పానిండియా సినిమాకు కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: దీపక్ దేవ్. నిర్మాతలు: సుభాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్.