Alka Yagnik | అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఫేమస్ సింగర్ అల్కా యాగ్నిక్..!
Alka Yagnik | అల్కా యాగ్నిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంబైల్లో అత్యుత్తమ గాయనీ గాయకుల్లో ఆమె ఒకరు. సంగీతంతో ఆమె సంబంధం దశాబ్దాల నాటిది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె తన పాటల ద్వారా సంగీత అనుమానులను అలరిస్తున్నారు.
Alka Yagnik | అల్కా యాగ్నిక్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తొంబైల్లో అత్యుత్తమ గాయనీ గాయకుల్లో ఆమె ఒకరు. సంగీతంతో ఆమె సంబంధం దశాబ్దాల నాటిది. నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె తన పాటల ద్వారా సంగీత అనుమానులను అలరిస్తున్నారు. అయితే, ఆమె ఓ అరుదైన వ్యాధిబారినపడ్డారు. దాంతో ఆమె వినికిడి సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తనకు వినికిడి సమస్య ఎలా వచ్చింది..? దాన్ని ఎలా గుర్తించిందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
అల్కా యాగ్నిక్ ప్రస్తుతం సెన్సోరిన్యూరల్ నెర్వ్ హియరింగ్ లాస్‌తో బాధపడుతున్నారు. అయితే, అనుకోని వైరల్ ఎటాక్ కారణంగా ఆమె ఈ సమస్య బారినపడ్డానని.. సోకే వరకు దాని గురించి వాపోయింది. తన ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫాలోవర్స్.. కొద్ది వారాల కిందట తాను విమానం దిగివస్తుంటే తనకేం వినబడలేదని.. గత కొన్నిరోజుల నుంచి ఎందుకు కనిపించట్లేదని అడిగిన వారి కోసం ప్రస్తుతం ఈ విషయం చెబుతున్నానన్నారు. తాను ఓ అరుదైన సెన్సోరిన్యూరల్ హియరింగ్ లాస్ సమస్యతో బాధపడుతున్నానని.. ఈ విషయాన్ని డాక్టర్లు చెప్పారని తెలిపారు.
వైరల్ ఎటాక్‌తో ఇలా జరిగిందని.. అలా అవుతుందని తాను అసలు ఊహించలేదని చెప్పింది. భారీ శబ్దంతో పాటలు వినడం, హెడ్‌ఫోన్స్ వాడకం తగ్గించాలని సూచించింది. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని తెలిపింది. అల్కా యాగ్నిక్ 90వ దశకంలో ఎన్నో హిందీ చిత్రాల్లో పాటలు ఆలపించింది. అదే సమయంలో పలు రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరించారు. 25 భాషల్లో దాదాపు 21వేలకుపైగా పాటలను ఆలపించారు. 2022లో మోస్ట్ స్ట్రీమ్డ్ ఆర్టిస్ట్‌గా గిన్నిస్ రికార్డును సైతం సొంతం చేసుకున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

