న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ఆలియా భట్ బంపర్ ఆఫర్ కొట్టేసింది. గంగూభాయ్ కఠియావాడీ హిట్‌తో దూసుకెళ్తున్న ఆమె ఇప్పుడు హాలీవుడ్‌లోకి ఎంట్రీకానున్నది. నెట్‌ఫ్లిక్స్ తీస్తున్న హార్ట్ ఆఫ్ స్టోన్ థ్రిల్లర్‌లో ఆలియా నటించనున్నది. గాల్ గ్యాడట్‌తో పాటు ఆలియా కూడా ఆ ఫిల్మ్‌లో నటించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. హార్ట్ ఆఫ్ స్టోన్‌ను డేవిడ్ ఎలిసన్ ప్రొడ్యూస్ చేయనున్నారు. గాల్ గ్యాడెట్, ఆమె భర్త జేరన్ వార్సనో కూడా ఈ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. 2019లో రిలీజైన గల్లీ భాయ్, ఈ ఏడాది రిలీజైన గంగూభాయ్ చిత్రాలతో ఆలియాకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ రెండు సినిమాలను ప్రదర్శించారు. గల్లీ బాయ్ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో గంగూభాయ్ సినిమాను కూడా రిలీజ్ చేయనున్నారు.