‘ముగ్గురి ప్రభావం నా జీవితంపై బలంగా ఉంది. వారే సంజయ్‌లీలా బన్సాలీ, కరణ్‌జోహార్, షారుఖ్‌ఖాన్. వీరి ముగ్గురూ నా మెంటర్స్’ అని మీడియా ముఖంగా చెప్పారు అలియాభట్. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘ ‘గంగూభాయ్’ కోసం తొలిసారి సంజయ్‌లీలా బన్సాలీగారితో పనిచేశాను. ఆయన సెట్లోకి వెళితే, వేరే ప్రపంచంలోకెళ్లిన ఫీలింగ్. కెమెరా ముందు ఏమైనా చేయగలమన్న క్లారిటీ వచ్చేస్తుంది.
ధైర్యంగా నటించవచ్చు అనే భరోసా కలుగుతుంది. ఆయన అలా మాయచేసేస్తారు. ‘గంగూభాయ్’ నిర్మాణంలో ఉన్నప్పుడు సంజయ్సార్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కరణ్ జోహార్ నుంచైతే ఎదుటివారిని గౌరవించే విధానం నేర్చుకున్నాను. అంతేకాదు సబ్జెక్ట్‌పై అవగాహ పెంచుకునే విధానం ఎలాగో తెలుసుకున్నాను. సెట్లో అందరితో ఎలా కలిసిపోవాలి. పాత్రను ఎలా అర్థం చేసుకోవాలని అనేది షారుఖ్‌ని చూసి నేర్చుకున్నాను. ఈ విధంగా ఈ ముగ్గురూ నాపై బలమైన ప్రభావమే చూపించారు’ అంటూ చెప్పుకొచ్చారు అలియాభట్.