Alia Bhatt removes Her daughter Photos | బాలీవుడ్ నటి ఆలియా భట్ తన కూతురు రాహా (Raha) రక్షణ కోసం ఒక అడుగు ముందుకు వేసింది. సోషల్ మీడియాలో ఉన్న తన కూతురు రాహా (Raha) ఫొటోలన్నింటిని తన ఖాతా నుంచి తొలగించింది. తన కుమార్తె గోప్యతను భంగం కలగకుండా కాపాడాలనే ఉద్దేశ్యంతోనే ఆలియా ఈ పని చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు అలియాతో పాటు రణబీర్ కపూర్ కూడా అర్హని పబ్లిక్ దృష్టి నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఆలియా నిర్ణయాన్ని నెటిజన్లు గౌరవించడంతో పాటు పిల్లలు ప్రైవసీ విషయంలో వారు మద్దతుగా నిలుస్తున్నారు.
బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ – అలియా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా డేటింగ్లో వీరిద్దరూ పెళ్లి బంధంతో 2022లో ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న ఏడాదికే వీరికి రాహా (Raha) పుట్టింది. అయితే ఎప్పుడు తన చిలిపి పనులతో పాటు తన పిల్లి కండ్లతో ప్రత్యేకంగా నిలిచిన రాహా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో పాటు తాను చేసే అల్లరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అయితే పిల్లలను సోషల్ మీడియాకు ఎక్స్పోజ్ చేయడం వలన జరిగే పరిణామలను ముందే ఉహించిన ఆలియా తన ఖాతా నుంచి రాహా ఫొటోలను తొలగించింది. దీంతో ఆలియా నిర్ణయం పట్ల నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు సెలబ్రీటీలు తమ పిల్లలను ప్రైవసీ విషయంలో సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం కొత్తేమి కాదు. ఇంతకుముందు స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ – అనుష్కా జంట కూడా తమ పిల్లలు వామికా, అకాయ్లను మీడియాకు దూరంగా ఉంచింది. ఇప్పటికి కూడా వారి ఫొటోలు ఎక్కడ కనిపించవు. టాలీవుడ్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా ఇదే రూల్ ఫాలో అవుతున్నారు. తమ కూతురు క్లీంకారా మీడియాకు ఎక్స్పోజ్ అవ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.