కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథా చిత్రాల్ని ఎంచుకుంటూ హిందీ చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అలియాభట్. తాజాగా ఈ భామ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. “హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే చిత్రం ద్వారా హాలీవుడ్లో అరంగేట్రం చేయబోతున్నా. షూటింగ్లో పాల్గొనేందుకు అమెరికా బయలుదేరాను.
చాలా కాలంగా సినిమాలు చేస్తున్నప్పటికి హాలీవుడ్ అనుభవం కొత్తగా అనిపిస్తున్నది. కాస్త ఒత్తిడిగా ఫీలవుతున్నా. మీ అందరి దీవెనలు నాకు కావాలి’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అలియాభట్. ప్రియాంకచోప్రా, దీపికా పడుకోన్ హాలీవుడ్ అవకాశాలు దక్కించుకొని సక్సెస్ కావడంతో వారి బాటలోనే అలియాభట్ హాలీవుడ్‌కు పయనమైంది. వివాహం అనంతరం అలియాభట్ సరికొత్త ప్రణాళికలతో కెరీర్లో ముందుకెళ్తున్నదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.