Jigra Movie Trailer | అలియా భట్ ‘జిగ్రా’ తెలుగు ట్రైలర్ రిలీజ్
Jigra Movie Trailer | రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’(JIGRA).
Jigra Movie Trailer | రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తున్న తాజా చిత్రం ‘జిగ్రా’(JIGRA). ఈ సినిమాను ధర్మ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అలియా భట్, షాహీన్ భట్ & సోమెన్ మిశ్రా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మౌనిక ఓ మై డార్లింగ్ సినిమా ఫేం వసన్ బాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి ‘జిగ్రా’ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు.
బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. రాఖీ కట్టి తన అక్కకు ఏ కష్టం వచ్చిన చూసుకుంటాను అంటారు సోదరులు. కానీ ఇక్కడ తన తమ్ముడికి కష్టం వస్తే.. అతనికి ఎలాంటి హానీ జరగకుండా కాపాడుకుంటానని అలియా భట్ ఒక అక్కగా ప్రమాణం చేస్తుంది. అయితే అసలు తన తమ్ముడికి వచ్చిన కష్టం ఏంటి. అక్కగా అలియా ఏం చేసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘ఆర్చీస్’ చిత్రంలో కీలక పాత్ర పోషించినవేదాంగ్ రైనా అలియా భట్ తమ్ముడిగా నటిస్తుండగా.. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
సారపాకలో ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
KTR | ఢిల్లీకి సంచులు మోయడంలో, చక్కర్లు కొట్టడంలో రేవంత్‌కు పదికి పది మార్కులు : కేటీఆర్
ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Drinking Water | చలికాలంలో రోజూ తగినంత నీళ్లను తాగాల్సిందే.. నీరు తగ్గితే ఈ సమస్యలు వస్తాయి..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

