Alia Bhatt | బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ జంట తమ గారాల పట్టికి నామరకరణం చేసింది. కూతురికి ‘రాహా’ అని పేరు పెట్టినట్లు ఆలియా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన భర్త రణ్‌బీర్ ఈ పేరును సూచించినట్లు పేర్కొంది. ‘రాహా’ పేరుకు గల అర్థాలను సైతం వివరించింది.
ఈ ఏడాది ఏప్రిల్14న వీరిద్దరు ఘనంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళైన రెండు నెలలకే ఆలియాభట్ తన ప్రెగ్నెన్సీని వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ప్ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పింది.