యువ నటుడు కృష్ణవంశీ కథానాయకుడిగా పరిచయం అవుతున్న సరికొత్త ప్రేమకథాచిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. మోక్ష కథానాయిక. చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకుడు. హైమావతి, శ్రీరామ్ జడవోలు నిర్మాతలు. ఆగస్ట్ 2న సినిమాను విడుదల చేయనున్నట్టు శనివారం మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటివరకూ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి స్పందన వస్తున్నదని, సినిమా అంతకు మించి ఉంటుందని మేకర్స్ తెలిపారు. బ్రహ్మాజీ, సుధ, ప్రమోదిని, వెంకటేశ్ కాకుమాను, చైతన్య గరికిపాటి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రేమ్‌సాగర్, సంగీతం: శశాంక్ తిరుపతి, నిర్మాణం: హైనివా క్రియేషన్స్.