Akshay Kumar | ఆగస్టు 15పైనే అక్షయ్ కుమార్ ఫోకస్.. పుష్ప ది రూల్ రిలీజ్ డైలమా..?
Akshay Kumar | అల్లు అర్జున్ టైటిల్లో నటిస్తోన్నపుష్ప ది రూల్ (Pushpa 2 the rule ) ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) నటిస్తోన్న Khel Khel Mein సినిమా ఇదే తేదీన వస్తుందని ప్రకటించారు.
Akshay Kumar | అల్లు అర్జున్ టైటిల్లో నటిస్తోన్న చిత్రం పుష్ప ది రూల్ (Pushpa 2 the rule ). ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ ముందుగా ప్రకటించిన ప్రకారం విడుదల కావడం లేదంటూ పుకార్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. విక్రమ్ హిస్టారికల్ డ్రామా తంగలాన్ ఆగస్టు 15నే రాబోతుందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar) నటిస్తోన్న Khel Khel Mein సినిమా ఇదే తేదీన వస్తుందని ప్రకటించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ముందుగానే రిలీజవుతుండటం.. అది కూడా ముందుగానే ప్రకటించిన పుష్ప ది రూల్ విడుదల తేదీనే కావడంతో చాలా మంది మూవీ లవర్స్ డైలమాలో పడిపోయారన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి అక్షయ్‌కుమార్ సినిమా రిలీజ్ బన్నీ మూవీపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా..? లేదా అనేది చూడాలి.
ముదస్సార్ అజీజ్ డైరెక్ట్ చేసిన ఖేల్ ఖేల్ మే చిత్రంలో తాప్సీ పన్ను, వాణీ కపూర్, ప్రగ్యాజైశ్వాల్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, ఆదిత్యా సీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ వకూ ఫిలిమ్స్, కేకేఎం ఫిలిం ప్రొడక్షన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. హఠాత్తుగా అక్షయ్ కుమార్ టీం విడుదల తేదీలో మార్పులు చేయడంతో పుష్ప ది రూల్ రిలీజ్ వాయిదా అంటూ పుకార్లు ఊపందుకున్నాయి. మరి దీనిపై మేకర్స్ ఏదైనా స్పందిస్తారేమో చూడాలి.
Akshay Kumar’s “Khel Khel Mein” releases on August 15, 2024, moving up from September 6. Expect a box office clash with John Abraham’s “Vedaa.” Follow @hitflik for updates. #KhelKhelMein #AkshayKumar #IndependenceDay2024 #hitflik pic.twitter.com/a2FMfFzsFF
— HitFlik (@HitFlik_) June 13, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

