అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ మైగాడ్-2’ చిత్రం దేశ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పాఠశాల విద్యార్థుల్లో లైంగిక విజ్ఞానం అవశ్యకతను తెలియజెప్పే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. లైంగిక విజ్ఞానం విషయంలో సమాజంలోని అపోహలు తొలగిపోవాలనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు తెలిసింది. ఇందులో ఓ అగ్ర హీరో నటించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ హక్కులను దక్కించుకుందని తెలిసింది. ‘ఓ మైగాడ్-2’ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద 150కోట్లకుపైగా వసూళ్లను సాధించింది