Akshay: ‘ఓ మై గాడ్ సీక్వెల్’ షూటింగ్ పూర్తి చేసిన అక్షయ్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.ఆయన నటించిన బెల్ బాటమ్ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించింది. ప్రస్తుతం 2012లో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న హిందీ చిత్రం ఓ మై గాడ్ రీమేక్‌గా ఓ మై గాడ్ 2 చేస్తున్నాడు.
తాజాగా ఓ మై గాడ్ 2 చిత్ర షూటింగ్ పూర్తి చేశాడు. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. యామి గౌతమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో అక్షయ్ కృష్ణుడి పాత్ర పోషిస్తుండగా, ఈ సినిమా కొసం అక్షయ్ 20 రోజులు కాల్షీట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. అమితాయ్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని, అక్షయ్‌కుమార్ – అశ్విన్ వర్డే కలిసి నిర్మిస్తుండటం విశేషం.
అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’, ‘ఆత్రంగీ రే’, ‘రామ్ సేతు’, ‘రక్షా బంధన్’, ‘మిషన్ సిండ్రెల్లా’ సినిమాలున్నాయి. అయితే తన 150వ సినిమాను ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడట. జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయటంలో సిద్ధహస్తుడుగా అక్షయ్ పేరు సంపాదించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akshay Kumar
- oh my god
- sequel
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

