e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో క్యాస్టింగ్ విషయాన్ని ఎప్పుడైనా గమనిస్తే ఓ విశేషం ఉంటుంది. తన సినిమాల్లో నటుల ఎంపిక చాలా కొత్తగా అనిపిస్తుంది. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లను తీసుకొస్తుంటాడు. ఇప్పటికే ఖుష్బూ, నదియా, టబు లాంటి సీనియర్ హీరోయిన్లకు తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో సిమ్రన్‌ను తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు మేల్ ఆర్టిస్టులను కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాడు త్రివిక్రమ్. మొన్నటి అల వైకుంఠపురములో సినిమా మలయాళ నటుడు జయరామ్‌ను కూడా అలాగే తీసుకున్నాడు. అంతేకాదు అక్కినేని అల్లుడు సుశాంత్‌కు కూడా ఈ చిత్రంలో ఓ పాత్ర ఇచ్చాడు. ఇప్పుడు మ‌హేష్ బాబు సినిమాలో కూడా మ‌రో అక్కినేని వార‌సుడికి మంచి రోల్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

ఇప్పటి వరకు హీరోగా నటిస్తూ వచ్చిన సుమంత్ .. ఇప్పుడు కారెక్టర్ ఆర్టిస్టుగా మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, సుమంత్ మంచి స్నేహితులు. పెళ్లికి ముందు ఎక్కువగా సుమంత్‌తోనే ఉండేవాడు మహేష్. ఆ తర్వాత కెరీర్‌లో ఇద్దరూ బిజీ అయ్యారు. మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు.. సుమంత్ మాత్రం హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇన్నేళ్లకు ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరి అది నిజమా కాదా అనేది త్రివిక్రమ్ చెప్తేనే క్లారిటీ వస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

గ్యాంగ్ లీడ‌ర్‌గా ముందు ఎవ‌రిని అనుకున్నారో తెలుసా?

అనీల్ రావిపూడి ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ..!

క్యాలీ ఫ్ల‌వ‌ర్ టైటిల్‌తో వ‌స్తున్న సంపూ.. టీజర్ అదుర్స్

త్వ‌ర‌గా కోలుకోవాల‌ని బన్నీకు స్వీట్ మెసేజ్ పంపిన చ‌ర‌ణ్ దంప‌తులు

లైగ‌ర్ టీజ‌ర్ వాయిదా వేసిన నిర్మాత‌లు

పెళ్లి కూతురిలా ముస్తాబైన బిగ్ బాస్ బ్యూటీ.. ఫొటోలు వైర‌ల్

సాయి ప‌ల్ల‌వి ప‌వ‌ర్ ఫుల్ లుక్ విడుద‌ల‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అప్పుడు సుశాంత్.. ఇప్పుడు సుమంత్.. బ్రేక్ ఇస్తున్న త్రివిక్రమ్

ట్రెండింగ్‌

Advertisement