కొన్ని సినిమాలు థియేటర్స్‌లో వర్కవుట్ కావు. కానీ బుల్లితెర, ఓటీటీపై సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమాల్లో ఒకటి నాగార్జున వైల్డ్ డాగ్. ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం.. అప్పటి పరిస్థితుల కారణంగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఫ్లాప్ అయింది. కనీసం రూ.10కోట్లు కూడా వసూలు చేయలేక డిజాస్టర్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోంది.
NIA తీవ్రవాద ఆపరేషన్ నేపథ్యంలో వైల్డ్ డాగ్ సినిమాను తెరకెక్కించాడు కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమెన్. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మాత్రం దారుణంగా ఫ్లాప్ అయింది. సినిమా అంత మంచి టాక్ సొంతం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఫ్లాప్ అయింది అనేది ఎవరికీ అర్థం కాలేదు. ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో దూసుకుపోతుంది. అక్కడ వైల్డ్ డాగ్ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు ఆడియన్స్. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఓటీటీలో వైల్డ్ డాగ్ సినిమాను చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన నేషనల్, ఇంటర్నేషనల్ సినిమాలను కూడా వైల్డ్ డాగ్ బీట్ చేస్తుంది.
థియేటర్లలో విడుదలైన 40-45 రోజుల తర్వాతే ఈ సినిమాను ఓటీటీ ( OTT )లో విడుదలవుతుందని దర్శక నిర్మాతలు ముందుగా ప్రకటించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. సినిమా ఫ్లాప్ అవడంతో ముందు చెప్పిన తేదీ కంటే 20 రోజుల ముందే ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాలో సయామి ఖేర్, అలీ రెజా, అతుల్ కులకర్ణి తదితరులు నటించారు. హైదరాబాద్, ముంబై లాంటి ప్రదేశాల్లో జరిగిన బాంబ్ బ్లాస్టులను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు అహిషర్ సోలమన్. స్క్రీన్ ప్లే అదిరిపోయినా కూడా కలెక్షన్స్ మాత్రం అస్సలు రాలేదు. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం హిట్ అయింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
పీపీఈ కిట్‌లో కూరగాయలు కొనడానికి వెళ్లిన హీరోయిన్.. వీడియో
కరోనా టైంలోను ఖాళీ లేకుండా ఫుల్ బిజీ అయిన నాని..!
ఒక్కో పాటకు సిద్ శ్రీరామ్ రెమ్యునరేషన్ తెలిస్తే ఖంగు తింటారు..!
చీరకట్టుతో మాయ చేస్తున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
కోవిడ్ సమయంలోను షూటింగ్.. ఇటలీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో
శ్రీరామనవమి రోజు ఆదిపురుష్ లుక్ ఎందుకు రిలీజ్ కాలేదు..!