నాగ చైతన్య అంత అద్భుతమైన కథతో వస్తున్నాడా.. ఆసక్తికరంగా థాంక్యూ ట్రైలర్
Akkineni Naga Chaitanya Thank You Trailer | అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఒకటి రెండు కాదు మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో థాంక్యూ సినిమా జూలై 22న విడుదల కానుంది. విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడంతో అంచనాలు బాగా పెరిగాయి. పైగా జోష్ సినిమా ఫ్లాప్ కావడంతో ఆ లెక్క ఇప్పుడు సరి చేస్తాను అంటున్నాడు దిల్ రాజు. కచ్చితంగా చైతూకి ఈ సినిమాతో మరుపు రాని విజయం వస్తుందని ఆయన ధీమాగా చెప్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా థాంక్యూ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ వచ్చింది. థాంక్యూలో ఒక కొత్త కథను ట్రై చేస్తున్నాడు నాగ చైతన్య.
ఈ సినిమాకు బీవీఎస్ రవి కథ అందించాడు. జీవితంలో మన ఎదుగుదలకు తోడ్పడిన వాళ్లు ఎవరైనా సరే వాళ్లని అస్సలు మర్చిపోకూడదు.. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. వినడానికి చాలా ఎక్సైటింగ్గా ఉన్న ఈ కాన్సెప్ట్ ను సినిమాగా ఎలా మలిచారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇంచుమించు ఇదే తరహా కాన్సెప్ట్ తో మూడేళ్ల కింద మహేశ్ బాబు మహర్షి సినిమా చేశాడు. కాకపోతే ఇందులో హీరో అందరిని గుర్తు పెట్టుకోడు.. తన కోసం జీవితాన్ని త్యాగం చేసిన ప్రాణ స్నేహితుడు అల్లరి నరేశ్ కోసం ఇండియాకు వచ్చి అతడి సమస్యలను తీరుస్తాడు మహేష్. కాకపోతే థాంక్యూ సినిమాలో మాత్రం.. తన ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని ఇండియాకు వచ్చి.. వాళ్లకు థాంక్యూ చెప్పి విదేశాలకు వెళ్ళిపోతాడు నాగ చైతన్య.
ఒకప్పుడు రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమా కథ కూడా ఇలాగే ఉంటుంది. కాకపోతే అందులో హీరో తన పెళ్లికి పాత మిత్రులు అందరిని పిలుస్తాడు. ఇక ప్రేమమ్ సినిమాలో మూడు వయసులకు సంబంధించిన ప్రేమకథలు ఉంటాయి. ఇప్పుడు థాంక్యూలో కూడా చైతన్యకు స్కూల్ ఏజ్ లో ఒక లవ్ స్టోరీ.. ఆ తర్వాత ఒక ప్రేమ కథ ఉంటాయి. ముందు సెల్ఫిష్ గా ఉన్న హీరో.. ఆ తర్వాత ఎలా మారాడు.. అందరికీ థాంక్యూ ఎలా చెప్పాడు అనేది జూలై 22న తెరమీద చూడాలి. ఏదేమైనా చైతూ ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో వస్తున్నాడు అనేది మాత్రం నిజం దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ మీద చూపించగలిగితే.. మనం తర్వాత విక్రమ్ కె కుమార్ తో దోబూచులాడుతున్న విజయం ఆయన దరిచేరినట్టే. ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా. నాగచైతన్య చెల్లిగా అవికా గోర్ నటిస్తోంది.
Read More :
“Naga Chaitanya | క్రేజీ న్యూస్..మహేశ్ బాబు అభిమానిగా నాగచైతన్య..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

