Naga chaitanya | యంగ్ హీరో నాగచైతన్య వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. గత ఏడాది లవ్‌స్టోరీతో హిట్ కొట్టిన చైతూ.. ఈ ఏడాది కూడా అదే హవాను కొనసాగిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజుతో ఈ ఏడాది మరో హిట్‌ను అందుకుని దూకుడు చూపించాడు. వరుస సక్సెస్‌లతో తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తన రేంజ్‌ను మరో మెట్టు ఎక్కించేందుకు ఇప్పుడు ఒక ఛాలెంజింగ్ పాత్రలో నటించబోతున్నాడు. తన కెరీర్లోనే తొలిసారిగా నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు చైతూ.
ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్లో ఆమీర్‌ఖాన్‌తో లాల్ సింగ్ చద్ధా సినిమాలో నటిస్తున్నాడు. దీంతో పాటు అక్కినేని కుటుంబానికి మనం వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రాశీఖన్నా, అవికా గోర్ కథానాయికలు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత చైతూ ఒక వెబ్‌సిరీస్‌లో కూడా నటించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో నాగచైతన్య నెగెటివ్ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇందులో చైతన్య మేకోవర్ కూడా విభిన్నంగా ఉంటుందని టాక్. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మూడు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుందని.. ఒక్కో సీజన్లో 8నుంచి 10 ఎపిసోడ్లు ఉంటాయని తెలుస్తోంది.