Naga Chaitanya | క్రేజీ న్యూస్..మహేశ్ బాబు అభిమానిగా నాగచైతన్య..!
నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం థ్యాంక్యూ (Thank You) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో నాగచైతన్య డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే పాత్రల్లో కనిపించనున్నాడు.
విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం థ్యాంక్యూ (Thank You) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందాల తార రాశీఖన్నా (Raashi Khanna), అవికాగోర్, మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. థ్యాంక్యూ ప్రపంచవ్యాప్తంగా జులై 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో నాగచైతన్య డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే పాత్రల్లో కనిపించనున్నాడు.
తాజాగా ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ అదేంటంటే మహేశ్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడట చైతూ. చైతూ స్కూల్ డేస్‌లో మహేశ్ అభిమానిగా కనిపించనున్నాడన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మొత్తానికి ఈ వార్త అఫీషియల్ కాకపోయినప్పటికీ అప్డేట్ను మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి బీవీఎస్ రవి కథనందించారు. లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. చైతూ మరోవైపు హిందీలో లాల్ సింగ్ చద్ధా సినిమాలో కీ రోల్ చేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

