నన్ను నేనే అసహ్యించుకున్నా అంటున్న…చిన్నారి పెళ్ళికూతురు..

Avikagor | సినీ రంగంలో గొప్పగా రాణించి మంచి క్రేజ్ ను సంపాందించుకోవాలని చాలా మంది నటీ నటులు అనుకుంటారు. అయితే ఇక్కడ ఓ నటి దానికి పూర్తి భిన్నంగా తన ను తానే అసహ్యించుకునేదని ఓ ఇంటర్వూలో తనే స్వయంగా చెప్పుకొచ్చింది. తానేవరకో కాదు ఉయ్యాల జంపాల హీరోయిన్ అవికాగోర్. ఈమె బాల్యం నుంచే తన నటనను కొనసాగిస్తుంది. ష్ష్ కోయి హే అనే హార్రర్ వెబ్ సిరీస్ తో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చింది. 2008లో వచ్చిన బాలీకా వధు సీరియల్ తో ఎంతో పాప్యూలారిటినీ తెచ్చుకుంది. తెలుగులో చిన్నారి పెళ్ళి కూతురు గా ప్రసారమయ్యేది. ఆనంది రోల్ లో ఈమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఎనలేని అభిమానాన్ని చూపించేవారు.
ఆయితే తాజాగా ఒక ఇంటర్వూలో తాను చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ టైంలో తానంత ఫిట్ గా లేనని హ్యాపీగా లేనని, పలు సందర్భాల్లో తనని తాను ఆసహ్యించుకున్నా అని..అసలు తను ఎలా కనిపిస్తున్నానో అని స్క్రీన్ పైన కూడా చూసుకునేది కాదని వెల్లడించింది. కాని నేను ఎలా కనిపిస్తున్నాననే దానికంటే నా నటనకే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని..ఈ విషయంలో వారికి ఎప్పుడు రుణ పడి ఉంటానని తెలియజేసింది. ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సినిమా చూపిస్త మామ, ఎక్కిడికి పోతావ్ చిన్నవాడ వంటి సినిమాలతో మంచి హిట్లను కూడా సాధించింది.ప్రస్తుతం అవికాగోర్ నటించిన 10th క్లాస్ డైరీస్ మార్చ్ 24న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని గరుడవేగ చిత్ర సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో లై ఫేం శ్రీకాంత్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటుగా నాగ చైతన్య థాంక్యూ సినిమాలో ఈమె కీలకపాత్రలో నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

