Nagarjuna-Akhil | నాగార్జున 100వ సినిమాలో.. అఖిల్ కీలక పాత్రలో నటించనున్నాడా..?
Nagarjuna-Akhil Multistarrer | సీనియర్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన బ్రహ్మస్త్ర విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ షూటింగ్ దశలో ఉంది.
Nagarjuna-Akhil Multistarrer | సీనియర్ అగ్ర కథానాయకుడు నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన ‘బ్రహ్మస్త్ర’ విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ఘోస్ట్’ షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం అనంతరం నాగార్జున, చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న మొహన్‌రాజా దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు. ఇందులో విశేషం ఏంటంటే ఈ చిత్రం నాగార్జునకు 100వ చిత్రంగా తెరకెక్కనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో నాగార్జునతో పాటు అక్కినేని అఖిల్ కూడా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మనం సినిమాలో అఖిల్, తండ్రితో కలిసి స్క్రీన్‌ను షేర్ చేసుకున్నాడు. మనం సినిమాలో అఖిల్ గెస్ట్ రోల్ చేయగా ఈ చిత్రంలో మాత్రం ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించనున్నాడట. అయితే ఈ చిత్రం తాజాగా మలయాళంలో సూపర్ హిట్టయిన ‘బ్రో డాడీ’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడట.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

