సాయివిజ్కి సంస్థ రూపొందించిన చిత్రం ‘అక్కడవారు ఇక్కడ ఉన్నారు’. స్వీయనిర్మాణ దర్శకత్వంలో కుందుర్తి త్రివిక్రమ రావు తెరకెక్కించారు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ఓ గీతాన్ని ఇటీవల తెనాలిలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విడుదల చేశారు. దర్శకనిర్మాత కుందుర్తి త్రివిక్రమరావు మాట్లాడుతూ ‘అతి తక్కువ వ్యయంతో సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాం. హత్య చేయబడ్డ ఇద్దరి వ్యక్తుల ఆత్మలు ఓ గ్రామంలోకి ప్రవేశించి ఏం చేశాయన్నదే చిత్ర కథాంశం’ అన్నారు. సాయిహర్షిణి, యస్.వి.రమణ, కేవీ రమణ, పి.లలిత, పిల్లి విజయ్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాజుకేశన్న, సంగీతం: శ్రీవెంకట్, పాటలు, కథ, స్క్రీన్ప్లే, నిర్మాత, దర్శకత్వం: కుందుర్తి త్రివిక్రమరావు.