Akira Nandan| పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక రాజకీయాలలోకి వచ్చాక పవన్ సినిమాలపై ఫోకస్ తక్కువగా పెడుతున్నాడు. రానున్న రోజులలో పవన్ ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం లేదు. దీంతో పవన్ తనయుడు అకీరాని హీరోగా చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. అకీరా నందన్ తొలిసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని కొన్నాళ్లుగా జోరుగా డిస్కషన్ జరుగుతుంది. అయితే పవన్ తన వారసుడు అకీరా నందన్ ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది.
అకీరా నందన్ ను ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ లాంచ్ చేయనున్నట్టు సమాచారం. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అశ్వినీ దత్ కాగా, ఇప్పుడు అకీరా నందన్ బాధ్యతలను కూడా ఆయనే తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అకీరా నందన్ హీరో అయితే ఆయన సరసన నటించే కథానాయిక ఎవరు అయితే బాగుంటుందనే చర్చ కూడా మొదలైంది.. అఖీరానందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సరే హీరోయిన్ మాత్రం మహేష్ బాబు కూతురు సీతార అయి ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఈ క్రమంలో అకీరా సరసన సితారని హీరోయిన్గా పరిచయం చేయడానికి మహేష్ ఎలాంటి అభ్యంతరం తెలపకపోవచ్చు. మరోవైపు సితార కూడా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చూపించాలని ఎంతగానో అనుకుంటుంది. మరి అకీరా-సితార జంటగా ఎవరైన సినిమా తీస్తే మాత్రం అది బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. ఇది జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కాగా,అకీరా నందన్ మొదటి సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్నాడని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్‌తో ‘పంజా’ సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్, ఇప్పుడు అకీరా నందన్‌ను లాంచ్ చేయడంకి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావలసి ఉంది.