అక్కినేని మూడోతరం వారసుడు అఖిల్ సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేయగా, ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అదలా ఉండగానే అఖిల్ స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ స్పై థ్రిల్లర్‌ను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అఖిల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ చిత్రం స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతుండగా, ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోస మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకున్నారు. గతంలో కొంత షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా వాయిదా పడగా ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించారు.
ఈ చిత్రం కోసం అఖిల్ తన దేహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. ప్రస్తుతం అఖిల్ ఈ చిత్రం షూటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అఖిల్ అక్కినేని గుర్రపు స్వారీ చేస్తూ ఉన్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సండే రోజు తన తన గిజెల్లే తో గడిపిన మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి అక్కినేని అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా,అనిల్ సుంకర నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు.