అఖిల్ రాజ్, అనన్య నాగళ్ల జంటగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై జి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. సూర్య అల్లంకొండ దర్శకుడు. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకులు విజయ్ కనకమేడల, కాశీ విశ్వనాథ్, జి.నాగేశ్వర్‌రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయిక అనన్య నాగళ్ల మాట్లాడుతూ..‘ఇదొక మంచి లవ్ స్టోరీ. దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఒప్పుకున్నాను. ఈ కథ ప్రేక్షకులకు నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం’ అన్నారు. దర్శకుడు సూర్య అల్లంకొండ మాట్లాడుతూ..‘ఇది నా మొదటి చిత్రం. ఓ ఫీల్ గుడ్ ప్రేమ కథతో తెరకెక్కిస్తున్నాం. ఆగస్టు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. తూర్పు గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నాం. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : ప్రణవ్, సినిమాటోగ్రఫీ : వీఆర్కే నాయుడు, సంగీతం : పీఆర్.