Akhil Next Movie | మరో వారంలో విడుదల కాబోతున్న ‘ఏజెంట్’ సినిమా గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ సైతం ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త టెన్సన్ పడుతున్నారు. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లవుతున్నా ఇంకా కమర్షియల్ హిట్ సాధించలేకపోయాడు. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అఖిల్ ఫ్లాపులకు బ్రేక్‌లు వేసిన.. కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేకపోయింది. ఇక ఇప్పుడు ఎలాగైనా అక్కినేని ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టాలని అఖిల్ మంచి కసి మీదున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక రెండేళ్లుగా ‘ఏజెంట్’ కోసమే సమయం కేటాయించిన అఖిల్.. తన తదుపరి సినిమా ఎంటా అనే క్లారిటీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మొన్నామధ్య నాగార్జున వందో సినిమానే అఖిల్ నెక్ట్స్ సినిమా అన్నట్లు వార్తలు వచ్చినా.. నాగ్ ఇంకా 99వ సినిమానే మొదలు పెట్టలేదు. ఇక వందో సినిమాకు చాలా టైమ్ ఉంది. కాగా ఇటీవల ‘దసరా’తో తిరుగులేని డెబ్యూ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో.. అఖిల్ చేతులు కలపనున్నట్లు వార్తలు వచ్చినా.. వాటిపై ఎవరూ స్పందించలేరు. దాంతో అది రూమర్‌గానే మిగిలిపోయింది.
కాగా తాజాగా అఖిల్ తదుపరి సినిమాకు మరో దర్శకుడి పేరు వినిపిస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమాను అనిల్ అనే కొత్త దర్శకుడి తెరకెక్కించనున్నాడట. ఇప్పటికే కథా చర్చలు కూడా ముగిసాయిని, అఖిల్‌కు కథ కూడా బాగా నచ్చిందని ఇన్సైడ్ టాక్. అన్ని కుదిరితే అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందట. కాగా ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.